ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికలు: సత్తా చూపని భారత సంతతి అభ్యర్ధులు.... అన్ని చోట్లా చేదు ఫలితాలే

హోరాహోరీగా జరిగిన ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.2007 తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.1.70 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు.మిగిలిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 No Indian Origin Winners In Australian Election, Australia, Liberal Mp Devanand,-TeluguStop.com

ఇకపోతే.

ఈ ఎన్నికలు భారత సంతతి అభ్యర్ధులకు , సమాజానికి నిరాశను మిగిల్చాయి.ఫెడరల్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్ధులు రాణించలేకపోయారు.న్యూసౌత్‌వేల్స్‌లోని వెంట్‌వర్త్ స్థానం నుంచి పోటీ చేసిన లిబరల్ ఎంపీ దేవానంద్ (డేవ్ శర్మ) ఓడిపోయారు.2019లో వెంట్‌వర్త్‌లో గెలిచిన ఆయన ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి శాసనసభ్యుడిగా చరిత్ర సృష్టించారు.అటు లిబరల్ పార్టీకి చెందిన జుగన్‌దీప్ సింగ్ సిడ్నీ శివారు ప్రాంతమైన చిఫ్లీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేసి లేబర్ పార్టీకి చెందిన ఎడ్ హుసిక్ చేతిలో ఓటమి పాలయ్యారు.అలాగే రైట్ వింగ్ పాపులిస్ట్ వన్ నేషన్ పార్టీకి చెందిన అమిత్ బతీష్ సైతం ఇదే స్థానం నుంచి ఓడిపోయారు.

సౌత్ ఆస్ట్రేలియాలోని మాకిన్ నుంచి వన్ నేషన్ అభ్యర్ధిగా నిలిచిన రాజన్ వైద్ కూడా పరాజయం పాలయ్యారు.న్యూసౌత్ వేల్స్‌లోని వెర్రివాలో గ్రీన్స్ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన అపూర్వ శుక్లా కేవలం 6.6 శాతం ఓట్లను మాత్రమే సాధించారు.సిడ్నీలోని గ్రీన్స్‌పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన చేతన్ సహాయ్ .లేబర్ పార్టీ నేత తాన్యా ప్లిబెర్సెక్ చేతిలో ఓడిపోయారు.

న్యూసౌత్ వేల్స్‌లోని గ్రీన్ వే స్థానంలో లేబర్ పార్టీకి చెందిన మిచెల్ రోలాండ్ చేతిలో లిబరల్ అభ్యర్ధి ప్రదీప్ పతి 37.7 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.ఇయన తెలుగువారు.

హైదరాబాద్‌లో జన్మించిన పతి 2005లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు.ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన లవ్ ప్రీత్ సింగ్ నందా కూడా ఓడిపోయారు.

Telugu Australia, Canada, Harmeet Kaur, Liberalmp, Michelle Roland, Indianorigin

న్యూసౌత్ వేల్స్‌లోని మెక్‌మోహన్‌లో లిబరల్ పార్టీ నుంచి పోటీ చేసిన వివేక్ సింఘా.లేబర్ పార్టీ అభ్యర్ధి బోవెన్ చేతిలో పరాజయం పాలయ్యారు.దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నుంచి సెనేట్‌కు పోటీ చేసిన హర్మీత్ కౌర్, రాజేష్ కుమార్, త్రిమాన్ గిల్ కూడా ఓడిపోయారు.మొత్తం మీద.25 మంది భారత సంతతి అభ్యర్ధులు తాజా ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేశారు.ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారతీయుల ప్రాతినిథ్యం తక్కువగానే వుంది.

అయితే రాష్ట్ర, స్టానిక స్థాయిల్లో మాత్రం భారతీయుల హవా మెరుగ్గానే వుంది.కానీ యూఎస్, యూకే, కెనడాలలో వున్నంత మంది భారతీయులు.

ఆస్ట్రేలియా రాజకీయాలు, ప్రజా జీవితంలో లేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube