Kavya Kalyanram : కావ్య మామూలు టాలెంటెడ్ కాదు.. ఉస్తాద్ సినిమాలో ఈ అమ్మడి యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా.. 

శ్రీ సింహ కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్‌( Kavya Kalyanram )ల తారాగణంలో రూపొందిన కొత్త తెలుగు సినిమా ఉస్తాద్( Ustaad Movie ) ఆగస్టు 12న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామాలో హీరోయిన్‌గా నటించిన కావ్య కళ్యాణ్‌రామ్ మరోసారి అందరి దృష్టిలో పడింది.

 Actress Kavya Raising Like Star-TeluguStop.com

ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నా దానిని ప్రజెంట్ చేసే విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు.ఫలితంగా ఈ మూవీ బోరింగ్ గా ఉండి ఫస్ట్ డేనే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ఇందులో మేఘనగా కావ్య చూపించిన నటన చాలామందిని కట్టిపడేసింది.

Telugu Adavi Ramudu, Balagam, Gangothri, Kavya Kalyanram, Priyadarshi, Tollywood

నిజానికి కావ్యకు మేకప్ వేసుకొని కెమెరా ముందు కనిపించడం కొత్తేం కాదు.కానీ పెద్దయ్యాక ఆమె పాత్రలలో జీవించడం నేర్చుకుంది.ఉస్తాద్ సినిమా చూస్తే ఎవరైనా సరే ఇదే అంటారు.

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కళ్ళతోనే నటించేసి ఆకట్టుకుంది.ముఖంలో అన్ని హావభావాలు అలవోకగా పలికించి మంత్రముగ్ధుల్ని చేసింది.

ప్రేమ సన్నివేశాలలో కూడా ఈ తార నటించిన తీరు చూస్తుంటే ఆమె నటనలో ఎంతో ప్రావీణ్యం సాధించినట్లు అనిపించింది.దర్శకుడు ఆమె రోల్‌ను చాలా చక్కగా రూపొందించగా దానిని సద్వినియోగం చేసుకొని కావ్య నట విశ్వరూపాన్ని చూపించింది.

ఇలాంటివి ఇంకొన్ని పాత్రలు ఆమెకు భవిష్యత్తులో దక్కే అవకాశముంది.ఈ రోల్స్ సద్వినియోగం చేసుకుంటే, ఆ సినిమాలు హిట్టైతే కావ్య స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందనడంలో సందేహం లేదు.

రీసెంట్ టైమ్‌లో తెలుగు తారల్లో కొందరు మాత్రమే తమ ప్రతిభతో ఆకట్టుకోగలిగారు.వారిలో కావ్య ఒకరైతే వైష్ణవి చైతన్య మరొకరు.భాష రాని, నటనలో అసలు ఓనమాలు కూడా దిద్దని ముంబై హీరోయిన్లకు బదులు కావ్య లాంటి వారిని తీసుకుంటే సినిమాలు కూడా మరింత హిట్ అవుతాయి.

Telugu Adavi Ramudu, Balagam, Gangothri, Kavya Kalyanram, Priyadarshi, Tollywood

బాలు, గంగోత్రి, అడవి రాముడు వంటి సినిమాల్లో బాలనటిగా అలరించిన కావ్య పెద్దయిన తర్వాత మసూద, బలగం( Balagam movie ) వంటి సినిమాలతో ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ పై కనిపిస్తే చూపించుకోలేం.అంతలా ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌ మనల్ని ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube