నేను అందగత్తెను కాదన్నారు.. నటి ఆమని కన్నీళ్లు!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి జంబలకడిపంబ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఆమని ఆ తర్వాత అమ్మ దొంగ, శుభలగ్నం,మిస్టర్ పెళ్ళాం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.హీరోయిన్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆమని ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ తల్లి పాత్రలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

 Actress Amani Emotional On Alitho Saradaga Show Actress Amani, Emotional , Alith-TeluguStop.com

ఈ విధంగా సహాయ నటి పాత్రలో చేయడమే కాకుండా బుల్లితెరపై కూడా ఆమని సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మరొక నటి ఇంద్రజ తో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా ఆమె మాట్లాడుతూ తను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ముఖ్యంగా బంధువులు కుటుంబ సభ్యుల నుంచి తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాలంటే ఎంతో పిచ్చి అని అప్పుడే జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి తారలను చూస్తూ వారి గురించి ఎక్కువగా ఆలోచించే దానినని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే తనకు దొంగతనం చేస్తే మామిడి పండ్లు తినడం అంటే ఎంతో ఇష్టమని తన ఇష్టాన్ని కూడా ఆమని అభిమానులతో పంచుకున్నారు.ఇక కెరీర్ విషయానికి వస్తే తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలలో నటించాలనే కోరిక ఉందని ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పగా.అది విని మా కుటుంబ సభ్యులు ఎన్నో విమర్శలు చేశారని తెలిపారు.

అది సినిమాల్లో చేయడం ఏంటి? ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, పైగా తనేమీ పెద్ద అందగత్తె కాదన్నారని ఈ సందర్భంగా ఆమని కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న విమర్శలను గురించి తెలియజేస్తూ కొంతవరకు ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube