సినిమా అంటే సినిమాగానే చూడాలి.హీరోయిన్.
అంటే హీరోయిన్ క్యారెక్టరే చేయాల్సిన అవసరం లేదు.హీరో ప్రతి సినిమాలో హీరో పాత్రనే పోషించాలి అనే రూల్ ఏమీ లేదు.
కొన్ని సినిమాల్లో అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి.ఆయా రోల్స్ ను బట్టి దర్శకులు వాటికి తగిన వ్యక్తులను సెలెక్ట్ చేస్తాడు.
వారిలో హీరోలు ఉండవచ్చు.హీరోయిన్లు నటించవచ్చు.
యాక్టర్స్ ను కేవలం ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ లాగే చూడాల్సి ఉంటుంది.అలా చూడాలి కూడా.
అప్పుడే వారు నిజమైన నటీనటులు అవుతారు.తెలుగు సినిమాల్లోనూ కొందరు హీరోయిన్లు హీరోలకు చెల్లెళ్లు, అక్కలుగా నటించారు.
మరికొందరు హీరోలు.హీరోయిన్లకు అన్నయ్యలు, తమ్ముళ్లుగా నటించారు.ఇంతకీలా నటించిన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*మహేష్ బాబు – కీర్తి రెడ్డి
వీరిద్దరు అర్జున్ సినిమాలో అక్కా తమ్ముళ్లుగా నటించారు.
* రామ్ చరణ్ – కృతి కర్బందా
బ్రూస్ లీ సినిమాలో రాం చరణ్ కు కృతి అక్కగా నటించింది.
*రాజశేఖర్ – మీరాజాస్మిన్
గోరింటాకు చిత్రంలో మీరా జాస్మిన్.రాజశేఖర్ కు చెల్లిగా యాక్ట్ చేసింది.
*సుధీర్ బాబు – సమంత
ఏ మాయ చేసావే మూవీలో సుధీర్ బాబు, సమంతకి అన్నగా యాక్ట్ చేశాడు.
*బాలకృష్ణ – దేవయాని
చెన్న కేశవరెడ్డి చిత్రంలో బాలయ్య, దేవయాని అన్నా చెల్లిగా నటించారు.
*విష్ణు మంచు – కాజల్ అగర్వాల్
మోసగాళ్లు మూవీలో విష్ణు, కాజల్ అన్నాచెల్లిగా యాక్ట్ చేశారు.
*శ్రీహరి – త్రిష
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కింగ్ సినిమాల్లో వీరిద్దరు అన్నా చెల్లిగా నటించారు.
*పవన్ కళ్యాణ్ – సంధ్య
అన్నవరం సినిమాలో వీరిద్దరు అన్నాచెల్లిగా నటించారు.
*ఉపేంద్ర – నిత్య మీనన్
సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర, నిత్యా మీనన్ అన్నాచెల్లిగా నటించారు.
*చిరంజీవి – ఖుష్బూ
స్టాలిన్ సినిమాలో ఖుష్బూ చిరంజీవికి అక్కగా యాక్ట్ చేసింది.
*అల్లరి నరేష్ – కార్తీక నాయర్
బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమాలో వీరిద్దరు ట్విన్స్ పాత్ర పోషించారు.
*నితిన్ – సింధు తులాని
ఇష్క్ సినిమాలో సింధు తులాని నితిన్ అక్క రోల్ పోషించింది.
*రామ్ – అంజలి
మసాలా మూవీలో వీరిద్దరు అక్కాతమ్ముడు రోల్స్ చేశారు.
*చిరంజీవి – కీర్తి సురేష్
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి, కీర్తి చెల్లిగా నటిస్తుంది.