సేంద్రీయ వ్యవసాయంల పోషకల లోప నివారణకు చర్యలు..!

సేంద్రియ పదార్థాలను( Organic materials ) కుళ్లిపోయేలా చేసి ఆ మిశ్రమాన్ని నేలకు అందించడాన్నే సేంద్రియ వ్యవసాయం అంటారు.సేంద్రీయ వ్యవసాయం వల్ల నేల యొక్క భౌతిక, రసాయన లక్షణాలు మెరుగు అవుతాయి.

 Actions To Prevent Nutrient Deficiency Of Organic Agriculture , Organic Agricult-TeluguStop.com

కంపోస్ట్, జంతు సంబంధ లేదంటే పచ్చిరొట్ట ఎరువులను సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగిస్తారు.సేంద్రీయ పదార్థం అనేది ముడి రూపంలో అనేక పోషకాలను కలిగి ఉంటుంది.

సేంద్రియ పదార్థం కుళ్ళిపోయే ప్రక్రియలో నత్రజని, గంధకము, జింక్, కాపర్, భాస్వరం లాంటి పోషకాలను మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలో విడుదల చేస్తుంది.

మొక్కలకు అందించాల్సిన పోషకాలను సమతుల్యం చేయడానికి సేంద్రియ పదార్థాలతో పాటు రాతి పోడులను ఉపయోగించి మొక్కలకు పోషకాలను అందించవచ్చు.నత్రజని, భాస్వరం, పొటాష్ ( Nitrogen, Phosphorus, Potash )లను ప్రథమ పోషకాలు అంటారు.మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్లను ద్వితీయ పోషకాలు అంటారు.

ఇక హైడ్రోజన్, ఆక్సిజన్, కర్బనము అనేవి మొక్కలకు సహజంగా వాతావరణం నుండి లభిస్తాయి.

మొక్కలకు కావలసిన పోషకాలలో నత్రజని అత్యంత ముఖ్యమైనది.నత్రజని( Nitrogen ) సంపూర్ణంగా మొక్కలకు అందితే మొక్కలు దృఢంగా మరియు ఆకుపచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి.నత్రజని లోపం ఉంటే మొక్కలు ఆకుపచ్చ రంగును కోల్పోయి పసుపు రంగులో పాలిపోయి బలహీనంగా, అనారోగ్యంగా కనిపిస్తాయి.

నత్రజని లోపాన్ని నివారించాలంటే.జీవామృతము, పంచగవ్య, ఆవుమూత్రం లాంటి గోవు ఆధారిత ఎరువుల వల్ల నత్రజనిని నేలకు అందించవచ్చు.

వర్మి వాష్, చేపల ఎమల్నన్, కేంద్రీయ నత్రజని యొక్క వాణిజ్య ఉత్పత్తులను మొక్కలపై పిచికారి చేయడం వల్ల నత్రజని నేరుగా మొక్కలకు చేరుతుంది.ఇలా చేయడం వల్ల పంట త్వరగా కోలుకుంటుంది.

పచ్చిరొట్ట ఎరువులు కూడా నత్రజని లోప నివారణకు తోడ్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube