డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతి శెట్టి కీలక పాత్రలో నటించారు.
ఇక అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణి నటరాజన్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు.
పి.జి విందా సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మరి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా సుధీర్ బాబు ఖాతాలో మరో హిట్టును అందించిందో లేదో చూద్దాం.
కథ:
సుధీర్ బాబు ఇందులో నవీన్ పాత్రలో కనిపించాడు.ఇతడు హిట్ లు అందుకున్న సినిమా దర్శకుడు.ఇక తను ఒక సినిమాను తీయాలి అని అనుకుంటాడు.దాంతో కళ్యాణి పాత్రలో ఉన్న కృతి శెట్టి ని ఎంచుకుంటాడు.కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఇక ఈ సినిమా కోసం కృతి శెట్టి ని హీరోయిన్ గా తీసుకుంటాడు నవీన్.
కానీ సినిమాలలో నటించడం కళ్యాణి తల్లిదండ్రులకు అస్సలు నచ్చదు.చివరికి కొన్ని కండిషన్ల మీద ఒప్పుకుంటారు.
అయితే అనుకోకుండా ఒక సంఘటన ఎదురవడం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.అలా వాళ్ళు ఎందుకు దూరమవుతారు.
అసలేం జరిగింది.చివరికి ఎలా కలుసుకుంటారు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
సుధీర్ బాబు నటన విషయానికి వస్తే మాత్రం.జీవించేశాడు అని చెప్పవచ్చు.ఎప్పటి లాగానే తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు సుధీర్ బాబు. ఈసారి ఆయన పాత్ర కాస్త డిఫరెంట్ గా అనిపించింది.ఇక కృతి శెట్టి కూడా ఈసారి తన నటనలతో మార్కులు బాగానే సంపాదించుకుంది.రొమాంటిక్ సీన్స్ లో బాగా అదరగొట్టింది కృతి శెట్టి.రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ తమ కామెడీతో ఎప్పటిలాగే న్యాయం చేసి తమ కామెడీతో నవ్వించారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్తగా ట్రై చేసినప్పటికీ అక్కడక్కడ కొన్ని మిస్ అయినట్లు అనిపించింది.ఇక పాత్రల తగ్గట్టు నటీనటులను బాగా ఎంచుకున్నాడు.వివేక్ సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.మిగతా టెక్నికల్ బాగాలు తమవంతు ప్రయత్నాలు చేశాయి.
విశ్లేషణ:
ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అద్భుతంగా చూపించారు.చాలావరకు డైరెక్టర్ ఇంద్రగంటి ఈ సినిమాను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, సుధీర్ బాబు నటన, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ బోరింగ్ అనే ఫీలింగ్ అనిపించింది.కొన్ని సన్నివేశాలను బాగా సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సింది ఏంటంటే కథ చాలా డిఫరెంట్ గా కనిపించింది.ముఖ్యంగా కామెడీ మాత్రం అదిరిపోయింది.కాబట్టి ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు.