సాధారణంగా శరీర బరువుని ఒకే అవయవంపై మోయడం అనేది చాలా కష్టం.అలా చేయాలంటే శరీరంలో చాలా సామర్థ్యం ఉండాలి.
అంతేకాదు చాలా కాలం పాటు సాధన కూడా చేస్తేనే ఇది కుదురుతుంది.అయితే ఇప్పటి వరకు ఒంటికాలి వేలిపై నిల్చున్న వారిని మనం చూశాం కానీ ఒంటి చేతిపై శరీరం మొత్తం లిఫ్ట్ చేసిన వారేవరినీ చూడలేదు.
నిజానికి ఒంటి చేతిపై బాడీ బరువును మోసే వన్ హ్యాండ్ క్రో యోగా పోజ్ చేయడం చాలామందికి సాధ్యమవుతుంది.అచ్చం దీని లాగానే ఉండే బాకీ పోజ్ మాత్రం ఇంకాస్త ఛాలెంజింగ్ గా ఉంటుంది.
దీనిని చాలా తక్కువమందే చేయగలరు.
అయితే తాజాగా ఒక యువకుడు ఈ బాకీ పోజ్‌ను విజయవంతంగా పర్ఫామ్ చేశాడు.
అలానే ఆ పోజ్‌లో చాలా సేపు ఉండి తన శక్తి సత్తువను నిరూపించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ముందుగా ఒక యువకుడు తన ఒంటి చేతిపై బాడీ మొత్తం పైకి లేపి ఉండటం చూడవచ్చు.
ఈ సమయంలో అతడు కాస్త వణికిపోయాడు.కాళ్లను గట్టిగా ఒక దగ్గర ఉంచాడు.
ఇలా అతడు ఒంటిచేత్తో గాల్లో లేవడాన్ని చూసి జిమ్‌లోని మిగతా వారంతా కూడా ఒక్కసారిగా స్టన్నయిపోయారు.
ఈ వీడియోను పూబిటీ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోకి రెండు లక్షల 90 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.“ఇది నమ్మేలా లేదు, ఈ ఫిట్నెస్ ఫ్రీక్‌కి మామూలు స్టామినా లేదు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.