శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తిరుమల‌ క్షేత్రంలో ఉన్న అన్ని ఉద్యానవనాలను సుందరీకరించు కొత్త శోభ తీసుకొస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అన్నారు.

 A Pleasant Atmosphere For The Devotees Who Come For Srivari Brahmotsavam ,pleas-TeluguStop.com

ఈ ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఒకటి వద్ద దాతల సహాయంతో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఉద్యానవనాన్ని చైర్మన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనసంతా స్వామివారి కృపలో నింపాలని కొత్త ఆలోచన చేశామన్నారు.

దాతల సహాయంతో తిరుమలలోని ఉద్యానవనాలకు పూర్వ వైభవం తెస్తామన్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు సిద్ధమయ్యారన్నారు.27న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని,ఆ రోజునా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు.సీఎం చేతుల మీదుగా తిరుమలలో నూతన పరకామణి భవనం ప్రారంభస్తారన్నారు.

తిరుమల కొండలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి ఒకటిన్నర సంవత్సరం అయ్యిందని,తిరుమలలో వాహనాల కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సీఎం 50 బస్సులను కేటాయించారన్నారు.తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడవారధి) నిర్మాణ పనులు ఏడాది ఆఖరి కల్లా పూర్తి చేస్తామన్నారు.2023 కొత్త యేడాది వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube