తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy)పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు.ఏపీలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగాలన్నారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్యాణ మండపాలు, సత్రాలు నిర్మించేందుకు టీటీడీ( TTD )కి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.కాంగ్రెస్( Congress ) పాలనలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.