తెలంగాణ( Telangana )లో విత్తనాల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు.
ఎండ వేడిమికి తాళలేక క్యూ లైన్లలో పాస్ పుస్తకాలను పెట్టి నీడలో నిల్చున్నారు.పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతుల నానా తంటాలు పడుతున్నారు.
విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు విత్తనాల పంపిణీపై అధికారులను నిలదీశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి విత్తనాలను అందుబాటులో ఉంచాలని అన్నదాతలు కోరుతున్నారు.