ఎన్టీఆర్ తో ఉన్న ఈమె ఎవరో గుర్తు పట్టారా.. ఆ స్టార్ డైరెక్టర్ భార్య అని మీకు తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే.తారక్ 41వ పుట్టినరోజు వేడుకలు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.

 Junior Ntr Prashant Neel Wife Photos Goes Viral In Social Media ,junior Ntr, Pr-TeluguStop.com

అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ భార్య కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

డ్రాగన్ ( Dragon )అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

2024 సంవత్సరం ఆగష్టు నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్, లిఖిత తారక్ ను కలిసిన సమయంలో ఈ ఫోటోలో దిగినట్టు భోగట్టా.

ప్రశాంత్ నీల్( Prashanth Neeel ) సక్సెస్ కు లిఖిత కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు నచ్చుతోంది.ఇతర భాషల్లో సైతం ఈ సాంగ్ కు అంచనాలను మించి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది.దేవర సినిమా నుంచి అతి త్వరలో సెకండ్ సాంగ్ కూడా విడుదల కానుందని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటుండగా దేవర సినిమాలో మాస్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది.

అనిరుధ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.దేవర సక్సెస్ సాధించడం ఎన్టీఆర్ కెరీర్ కు కీలకమనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube