పంజాబ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిన కేసులో కెనడాకు ( Canada ) చెందిన ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh ) అతని ముగ్గురు అనుచరులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.పంజాబ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా( Arsh Dala ) నిర్వహిస్తున్న స్లీపర్ సెల్స్‌ను ధ్వంసం చేసేందుకు ఎన్ఐఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య పెద్ద ముందడుగుగా చెబుతున్నారు.

కెనడాకు చెందిన అర్ష్‌దీప్ సింగ్ అతని భారతీయ ఏజెంట్లు హర్జీత్ సింగ్ అలియాస్ హ్యారీ మౌర్, రవీందర్ సింగ్ అలియాస్ రాజ్విందర్ సింగ్ అలియాస్ హ్యారీ రాజ్‌పురా, రాజీవ్ కుమార్ అలియాస్ షీలాపై న్యూఢిల్లీలోని ఎన్ఐఏ ( NIA ) ప్రత్యేక కోర్టు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లుగా యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.కెనడాలో ఉంటున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్( Khalistan Tiger Force ) ఉగ్రవాది అర్ష్‌దీప్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు భారతదేశంలో ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను నడుపుతున్నారు.

నిందితులు మౌర్ , రాజ్‌పురాలు స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్నారని వీరికి రాజీవ్ కుమార్ ఆశ్రయం కల్పిస్తున్నాడని ఎన్ఐఏ తెలిపింది.ఈ ముగ్గురూ అర్ష్‌దీప్ ఆదేశాల మేరకు అతని నుంచి అందిన నిధులతో వరుసగా ఉగ్రవాద దాడులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.మౌర్, రాజ్‌పురాలు షార్ప్ షూటర్లు.వీరు లక్షిత హత్యలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
అర్ష్‌దీప్ సూచనల మేరకు రాజీవ్ కుమార్ వీరికి లాజిస్టిక్స్ సపోర్టును అందించడంతో పాటు మిగిలిన ఇద్దరికి ఆయుధాలను సమకూరుస్తున్నట్లు ఎన్ఐఏ తన దర్యాప్తులో తెలిపింది.మౌర్, రాజ్పురాలను గతేడాది నవంబర్ 23న.రాజీవ్ కుమార్‌ను ఈ ఏడాది జనవరి 12న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.మొత్తం ఉగ్రవాద – గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.







