ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత చాలామంది సోషల్ మీడియాకి అంకితమైన వారు ఎందరో ఉన్నారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అనేక వీడియోలను చూస్తూ రోజుని ఇట్లే గడిపేస్తున్నారు చాలామంది.
ఈ నేపథ్యం లోనే అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.మరి ముఖ్యంగా కొన్ని రకాల ఫన్నీ వీడియోలు( Funny Videos ) ఎక్కువగా చూస్తుంటారు సోషల్ మీడియా నెటిజన్స్.
తాజాగా మరో ఫన్నీ వీడియో ఈ లిస్టులో చేరింది.ఈ వీడియోలో కొందరు యువకులు ఓ ముసుగు వేసుకున్న మహిళను భయపెట్టారు.
ఇక ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.
ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ ఆవు ( Cow ) వచ్చి ఆమెను వెంబడిస్తుంది.దీంతో ఆవిడ భయపడిపోయి పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి చాలా వేగంగా వెళ్ళిపోతుంది.దాంతో ఆ షాప్ యజమాని ఆవు పైకి మనుషులను భయపెడతావా అంటూ ఓ కర్రను తీసుకొని వచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తాడు.
దీంతో అక్కడ అసలైన ట్విస్ట్ బయట పడుతుంది.షాపు ఓనర్( Shop Owner ) చేసిన పనికి ఆవు వేషంలో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఏకంగా ఆవు వేషాన్ని తీసేసి అక్కడ నుంచి పరిగెత్తడం వీడియోలో కనబడుతుంది.
ఈ సంఘటన మొత్తం చూసిన ఆ ముసుగు మహిళ నన్ను భయపెట్టింది ఆవు కాదు., మనుషులే అని భావించి షాక్ గురైంది.ఇక ఈ వీడియోని చూసిన అనేకమంది వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.కొందరైతే మీకేమైందిరా ఇలా తయారయ్యారు అంటూ ఘాటుగా స్పందిస్తుంటే., మరికొందరేమో మీ ప్రాంక్ కు ఆవిడ బిత్తర పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి.