ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో తినడం కంటే బయట ఆహారం తినడానికి ఇష్టపడుతున్నారు.మారుతున్న కాలంకొద్ది పనులను నేపథ్యంలో ఇంట్లో వంటలు చేసుకుని తినే రోజులు తక్కువ అయిపోయాయి.
దీంతో చాలామంది వారికి నచ్చిన చోట ఆహ్లాదకరమైన వాతావరణంలో నచ్చిన ఫుడ్ చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇందుకోసం అనేకచోట్ల ఫుడ్ ట్రక్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి.
కాకపోతే మనం అవి ఉన్న చోటికి మాత్రమే వెళ్లాలి.ఇకపోతే తాజాగా ఆహారాన్ని సర్వ్ చేసే ఫుడ్ ట్రక్స్(Food trucks) కూడా మనకు అందుబాటులో రానున్నాయి.
ఇలాంటి ఫుడ్ ట్రక్స్ వల్ల నిర్వాహకులకు కూడా ఎలాంటి రెంట్ పే చేయకుండా మంచి లాభాలను అర్జిస్తున్నారు.ఇకపోతే తాజాగా ఐడియాను ఫాలో అవుతూ కొందరు ఏకంగా ఫుడ్ బస్సును ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో జనాలను తెగ ఆకర్షిస్తుంది.దీంట్లో ఈ వీడియో కాస్త తెగ వైరల్ గా మారింది.
ఇక వైరల్ గా మారిన వీడియోలో చిన్న చిన్న చక్రాలు ఉండి ఓ చిన్న సైజు బస్సును వాహనాన్ని నిర్మించారు.ఈ బస్సులో వంట సామాగ్రి తో పాటు కొన్ని టేబుల్ కూడా ఏర్పాటు చేసుకునే అంతగా స్థలాన్ని పెట్టుకున్నారు.అంతేకాదు ఈ బస్సులో(bus) సకల సౌకర్యాలు అమర్చుకునేందుకు వీలుగా చేశారు.కాకపోతే ఈ బస్సును ఎక్కడైనా నిలుపుతారో లేకపోతే బస్సులోనే ప్రయాణిస్తూ ఆహారం తింటారా విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
ఇంకా వీడియోలో వైరల్ అవుతున్న బస్సును గమనించినట్లయితే ఈ బస్సు ఇంకా పూర్తి కానట్లుగా కనబడుతోంది.
ఇక వీడియోని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.వీడియోను చూసి చాలామంది అసలు ఈ బస్సు రెస్టారెంట్(RESTAURANT) ఏర్పాటుకు సరిపోతుందా అంటూ సందేహాలను లేవనెత్తుతున్నారు.మరికొందరైతే దీన్ని సాధారణ వీధుల్లో వెళ్తూ తింటే ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ వస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు కొందరు.
కాకపోతే ఈ బస్సు చూడడానికి కాస్త వెరైటీగా అనిపించడంతో అది కాస్త వైరల్ గా మారింది.
.