సింగిల్ స్క్రీన్ థియేటర్లపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్( Telangana Film Chamber ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు నైజాం ఏరియాలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అయితే తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్ లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ఇటీవలే థియేటర్స్ యాజమాన్యం ప్రకటించింది.ఈ ప్రకటనపై స్పందించిన తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం తీసుకునే ముందు తమను ఎగ్జిబిటర్స్ సంప్రదించలేదని తెలిపింది.