వైరల్ వీడియో: సమయం స్ఫూర్తి అంటే ఇదేనేమో.. టైం చూసి గద్దపై అటాక్ చేసిన పాము..

ప్రతిరోజు సోషల్ మీడియాలో( Social Media ) అనేక రకాల వైరల్ వీడియోలు వస్తూనే ఉంటాయి.ఇకపోతే జీవితంలో సాధించలేము అంటూ ఏది ఉండదు.

 Viral Video Eagle Trying To Feed On Snake Gets Strangulated Details, Eagle Tryin-TeluguStop.com

ఇప్పుడు ఉన్న పరిస్థితి వచ్చే నిమిషంలో ఉంటుందో లేదో రోజులు ఇవి.అన్ని మన చేతిలో అదుపులోనే ఉంటాయి అనుకుంటుండగా ఒక్కోసారి పరిస్థితి తలకిందులై ప్రాణాల మీద కూడా రావచ్చు.అచ్చం ఇలాంటి సంఘటన తాజాగా ఓ గ్రద్ద( Eagle ) విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.ఓ పెద్ద పాము( Snake ) తన నోటికి చిక్కడంతో ఆహారం దొరికింది అనుకున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో గమనించినట్లయితే.

ఈ వీడియోలో గ్రద్ద, పాము పోరాడి చివరకు గ్రద్ద తన కాళ్ళ కింద పాము తలను పట్టుకుంటుంది.అలా పాము తలని గట్టిగా పట్టుకొని గ్రద్ద తన పొడవాటి ముక్కుతో పామును పీక్కొని తింటుంటుంది.అయితే ఆ సమయంలో కాస్త మామూలుగానే ఉన్న పాము ఒక్కసారిగా తన వ్యూహాన్ని మార్చి గ్రద్దపై అటాక్( Attack Eagle ) చేసింది.ఆ సమయంలో పాము ఒక్కసారిగా గ్రద్దను చుట్టుముట్టి దెబ్బకు నీలమట్టం చేసింది.

ఈ దెబ్బతో గ్రద్దకు ఊపిరాడకుండా పోవడంతో చివరికి ప్రాణాలను కోల్పోయింది.కాబట్టి పరిస్థితులు ఎప్పుడు మన చేతిలోనే ఉంటాయి అనుకోవడం మాత్రం పొరపాటే.వీలైనంత అలర్ట్ గా ఉంటూ ముందుకు వెళుతూ ఉండాలి.ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.మల్ల యోధుల్లాగా చివరి నిమిషంలో పాము తన వ్యూహాన్ని మార్చి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి చంపేసిన అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం గ్రద్ద తప్పు చేసిందంటూ వాపోతున్నారు.పామును చంపకుండా అలాగే ఉంచడం తప్పు చేసిందని వారు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube