తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు( farmers ) కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని కిషన్ రెడ్డి( Kishan Reddy ) మండిపడ్డారు.రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్ని రకాలుగా ఉండగా ఉందని చెప్పారు.చివరి గింజను సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు.
ఈ క్రమంలోనే సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతున్నారని విమర్శించారు.అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.