మాచర్ల( Macherla)లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది.ఈ మేరకు ఆయనపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి), ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు అయ్యాయి.
అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission) తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలోనే సీఈవో మాట్లాడుతూ పిన్నెల్లి( Pinnelli Ramakrishna Reddy ) అరెస్ట్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
ఈవీఎం ధ్వంసం అయినప్పటికీ డేటా సేఫ్ గానే ఉందని తెలిపారు.కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.