Las Vegas : విమానంలో తోటి ప్రయాణికుడిపై కత్తితో దాడి.. చంపేయాలని ప్లాన్ చేశానంటూ..

ఇటీవల కాలంలో విమానాల్లో షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటూ ప్రయాణికులకు హడల్‌ పుట్టిస్తున్నాయి.తాజాగా ఓ వ్యక్తి పెన్ను, టేపుతో విమానంలో తోటి ప్రయాణికుడిని చంపేందుకు ప్రయత్నించాడు.

 A Passenger Was Attacked With A Knife In The Flight It Was Said That He Had Pla-TeluguStop.com

ఈ దృశ్యాలను చూసి మిగతావారు ప్రాణ భయంతో వణికిపోయారు.చివరికి పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు.

దాడి చేసిన వ్యక్తి పేరు జూలియో అల్వారెజ్ లోపెజ్( Julio Alvarez Lopez ) అతను ఇటీవలసీటెల్ నుంచి లాస్ వెగాస్‌కు వెళ్తున్న విమానంలో ఎక్కాడు.పోలీసులు లోపెజ్ ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేసినట్లు అభియోగాలు మోపారు.

విమానంలో వింతగా ప్రవర్తించాడని, గ్లోవ్స్ తీస్తూ వేసుకుంటూ ఉన్నాడని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వబోతుండగా బాత్ రూమ్ లో కూడా చాలా సేపు గడిపాడట.

అతను రెండుసార్లు బాత్రూమ్‌కి వెళ్లాడని ఒక రిపోర్ట్ తెలిపింది.

Telugu Airplane, Assault, Weapon, Julioalvarez, Mafia Paranoia, Nri-Telugu NRI

లోపెజ్ తన సీటుకు తిరిగి వచ్చినప్పుడు, తన పక్కన ఉన్న వ్యక్తిని కొట్టడం ప్రారంభించాడు.పెన్ను, టేపుతో కళ్లపై పొడిచేందుకు కూడా ప్రయత్నించాడు.ఆ వ్యక్తి భార్య, ఒక సాక్షి లోపెజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని FBI తెలిపింది.

వారు అతనిపై అరుస్తూ ఉన్నారు.భార్యను కూడా లోపెజ్ కొట్టాడు.

ఆమె తన ఏడేళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి ప్రయత్నించింది.

Telugu Airplane, Assault, Weapon, Julioalvarez, Mafia Paranoia, Nri-Telugu NRI

రక్తం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.వారు నేలపై పెన్ను, టేప్ చూశారు.దాడికి గురైన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు, అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

పోరు తర్వాత లోపెజ్ విమానం ముందు భాగానికి వెళ్లాడు.తాను ఎఫ్‌బీఐ( FBI )తో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాడు.

విమానంలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి లోపెజ్‌ను కూర్చోమని చెప్పాడు. ఫ్లైట్ అటెండెంట్స్ అతని చేతులు లాక్ చేయడానికి కొన్ని కఫ్స్ ఇచ్చారు.

ఉదయం 8:30 గంటలకు విమానం ల్యాండ్ అయ్యే వరకు అలానే ఉన్నాడు.లాస్ వెగాస్‌( Las Vegas )లో లోపెజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మాఫియా అతని వెంటే ఉందని భావించి ఆ వ్యక్తిని చంపాలనుకున్నానని చెప్పాడు.ఆ వ్యక్తి తనకు తెలియదని, అయితే అతను కార్టెల్‌లో ఉన్నాడని అనుకున్నానని చెప్పాడు.

విమానం ఎక్కే ముందు పెన్నులు, రబ్బరు బ్యాండ్లతో ఆయుధాన్ని కూడా తయారు చేశానని చెప్పాడు.లోపెజ్ అమెరికాలో ఆశ్రయం కోసం చూస్తున్నారని ఫాక్స్ న్యూస్ తెలిపింది.

మార్చి 1న కోర్టులో ఇతడిని హాజరుపరచనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube