సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ లు హీరోల కంటే ఎక్కువ పర్ఫామెన్స్ చేస్తూ ఉంటారు.నిజానికి ఆ హీరోలకు ఆ హీరోయిన్ లతోనే ఎక్కువ క్రేజ్ అనేది వస్తుంది.
ఆ హీరోయిన్ ల పక్కన ఏ హీరో నటించిన కూడా తక్కువే అనిపిస్తుంది.అలాంటిది ఒక స్టార్ హీరోయిన్ సరసన ఓ స్టార్ కమెడియన్ చిందులేసి ఎనలేని క్రేజీ సంపాదించుకున్నాడు.
పైగా ఆ పాట కోసం ఆ సినిమాని ఏకంగా ఏడాది పాటు రన్ చేశారు.ఇంతకు ఆ పాట ఏంటంటే.
బాబు మోహన్, సౌందర్య కలిసి స్టెప్పులేసిన చినుకు చినుకు సాంగ్.
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచిన సౌందర్య గురించి అందరికీ పరిచయమే.
తన అందంతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక ఈమె ఈ లోకం నుండి దూరం అయ్యాక అందరికీ మరపురాని జ్ఞాపకం గా మారింది.
ఈమె తొలిసారిగా 1971లో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత ఏడాది నుంచి వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించింది.
ఈమెకు జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, రాజా, పవిత్ర బంధం, అనంతపురం, అమ్మోరు వంటి ఎన్నో సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.
ఈమెను తెలుగు సినీ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచుగా భావించారు.సౌందర్య తాను మరణించే వరకు ఎటువంటి గ్లామర్ పాత్రలలో ఎక్కువగా నటించలేదు.చాలా వరకు తెలుగమ్మాయిగానే కనిపించింది.
ఇక ఈమె 2003లో తన చిన్ననాటి స్నేహితుడును వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్ట్ తో ఎన్నో సినిమాలలో నటించింది.
ఇక సౌందర్య నటిగానే కాకుండా రాజకీయ పరంగా కూడా కొన్ని బాధ్యతలు చేపట్టింది.2004లో జరిగిన లోక్ సభ ఎన్నికలు బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేసింది.ఇక అదే ఏడాది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం కోసం సౌందర్య చార్టర్డ్ విమానంలో ప్రచారానికి బయలుదేరింది.ఆ సమయంలో తన సోదరుడు అమర్ నాథ్ కూడా ఉన్నాడు.
ఇక విమానంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఒకసారి ప్రమాదానికి గురయింది.ఇక ఆ విమానం గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో పడిపోవడంతో సౌందర్య తో పాటు మిగతా వాళ్ళందరూ పూర్తిగా కాలిపోయి మరణించారు.ఈ విషయం అందరికీ తెలియటంతో ఎంతోమంది ఆమె మరణాన్ని తట్టుకోలేక పోయారు.ఇప్పటికీ ఆమె అభిమానులు ఆమెను తలచుకుంటూనే ఉంటారు.
ఇదంతా ఇలా ఉంటే గతంలో సౌందర్య బాబు మోహన్ తో కలిసి చినుకు చినుకు అనే పాటకు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాట కోసం ఈ సినిమా ఏకంగా సంవత్సరం పాటు సినిమా థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డుతో కొనసాగింది.ఇప్పటికి ఈ పాట అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు.