ఏపీలో శ్మశానవాటికల్లో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది.నవరత్నాల్లో భాగంగా దళిత శ్మశానవాటికల్లో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది.
ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది.
శ్మశానవాటికల్లో ఇళ్ల నిర్మాణం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.
జగనన్న ఇళ్ల నిర్మాణాలపై స్టే విధించింది.అదేవిధంగా దళిత శ్మశానవాటికల్లో రైతుభరోసా కేంద్రాలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.