సోషల్ మీడియా( Social media )లో రోజురోజుకు ఎన్నో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.అవి చూడగానే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనకు ఫక్కున నవ్వు వచ్చేస్తుంది.
ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఫైన్లు తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల ఫీట్లు ప్రదర్శిస్తున్నారు.ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెనుక నంబర్ బోర్డును చేతులతో దాయడం, ఆడవారైతే చెంగుతో లేదా చున్నీతో దాయడం చేస్తుంటారు.
కొందరైతే నంబర్ ప్లేటుకు పేపర్ అతికించి వెళ్తుంటారు.ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్లు ఎక్కువగా ఉంటున్నాయి.ట్రాఫిక్ కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఫొటోలు తీస్తున్నాయి.దీంతో ఆటోమేటిక్‌గా వారి ఇళ్లకు ఫైన్లు వస్తుంటాయి.ప్రస్తుతం బైక్‌పై వెనుక కూర్చునే పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది.హెల్మెట్ లేకుంటే ఫైన్లు పడుతున్నాయి.
ఫైన్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది.
బెంగళూరు( Bengaluru )లో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.ఈ టెక్ సిటీలో బైక్‌లపై ప్రయాణిస్తూ చాలా మంది వర్క్ చేస్తుంటారు.తాజాగా ఈ నగరంలో ఓ బైక్ పిలియన్ రైడర్ చేసిన పని నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
వెనుక కూర్చున్న వారు కూడా ట్రాఫిక్ నిబంధనల( Traffic regulations ) ప్రకారం హెల్మెట్ ధరించాలి.ఆ వ్యక్తి వద్ద హెల్మెట్ లేనట్లుంది.హెల్మెట్ బదులుగా ఆ వ్యక్తి పేపర్ బ్యాగ్ ధరించాడు.దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.
భద్రతా కారణాల దృష్ట్యా బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని మీ అందరికీ తెలిసిందే.ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే, ఏదైనా సంఘటన జరిగినప్పుడు అతను బతికే అవకాశాలు తగ్గుతాయి.
దీంతో పాటు పోలీసులు భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు.ట్రాఫిక్‌లో బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ ధరించలేదని మరియు పోలీసులు అతనిని గమనించినట్లయితే, అతనికి జరిమానా విధించవచ్చని చూడవచ్చు.
ఆ యువకుడు ట్రాఫిక్ మధ్యలో ఆపి తన తలని పేపర్ బ్యాగ్ తో కప్పుకున్నాడు.ఇలాంటి తెలివితేటలు ఎలా వచ్చాయబ్బా అన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.