మునుగోడులో కొత్త ఓట్ల నమోదుపై తెలంగాణ హైకోర్టు జరిపిన విచారణ ముగిసింది.కొత్త ఓట్ల నమోదు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతల పిటిషన్ పై న్యాయస్థానం విచారణను ముగించింది.కాగా సవరించిన ఓటర్ల లిస్టును ఈసీ కోర్టుకు సమర్పించింది.అయితే కొత్త లిస్ట్ ప్రకారం మునుగోడులో 2,41,805 ఓట్లు ఉండగా.2022 జనవరి 5 నాటికి మొత్తం ఓటర్లు 2,27,101 ఓట్లు ఉన్నాయని ఈసీ తెలిపింది.