Maddox : ఇసుకలో పెద్ద గుంత తవ్విన బాలిక.. కుప్పకూలడంతో సజీవ సమాధి..!

ఇటీవల బీచ్‌లో ఇసుకలో ఆడుకుంటూ బాలిక చనిపోయిన విషాద సంఘటన అందరి మనసులను కలచివేస్తోంది.ఈ షాకింగ్ ఘటన ఫ్లోరిడాలో( Florida ) చోటుచేసుకుంది.

 A Girl Who Dug A Big Hole In The Sand Collapsed And Was Buried Alive-TeluguStop.com

స్లోన్ మాటింగ్లీ అనే 7 ఏళ్ల బాలిక తన సోదరుడు మాడాక్స్ ( Maddox )(9) కలిసి మంగళవారం నాడు ఫ్లోరిడాలోని బీచ్‌ వద్దకు వెళ్ళింది.ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ ఇసుకలో పెద్ద గుంత తవ్వారు.

గుంత లోపలికి వెళ్లి ఇంకా తవ్వుతూనే ఉండగా అది ఒక్కసారిగా కుప్ప కూలింది.దాంతో పైన ఇసుక వారిపై పడి కప్పేసింది.

చిన్నపిల్లలు కావడంతో ఈ ఇసుక నుంచి వారు పైకి రాలేకపోయారు.ఊపిరి కూడా పీల్చుకోలేకపోయారు.

వారి తల్లిదండ్రులు ఇండియానాకు చెందినవారు.వారు సెలవుల కోసం ఫ్లోరిడా వచ్చారు.లాడర్‌డేల్-బై-ది-సీ( Lauderdale-by-the-Sea ) అనే పట్టణంలో స్టే చేస్తున్నారు.ఇది మయామి నుంచి 33 మైళ్ల దూరంలో ఉంది.

కొందరు వ్యక్తులు ఈ చిన్న పిల్లలు ఇసుకలో కూరుకు పోవడం చూసి షాక్ అయ్యారు.సహాయం కోసం అధికారులకు కాల్ చేశారు.

రెస్క్యూ సిబ్బంది వెంటనే వచ్చి మాడాక్స్‌ ఛాతీ వరకు ఇసుకలో కూరుకు పోయాడని కనుగొన్నారు.వెంటనే వారు అతన్ని బయటకు లాగారు.

అదృష్టం కొద్దీ ఈ బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు.కానీ స్లోన్ మాటింగ్లీ( Sloan Mattingly ) ఇసుక లోతుల్లో పడిపోయింది.

అందువల్ల అధికారులు ఆమెను సులభంగా కనుగొనలేకపోయారు.ఇసుకను తవ్వడానికి పారలు, బకెట్లను ఉపయోగించారు.

ఆమె తండ్రి కూడా సహాయం చేశాడు.

వారు చివరకు స్లోన్‌ను కనుగొన్నారు.కానీ చాలా ఆలస్యం అయింది.ఆమెకు ఊపిరి ఆడక చనిపోయింది.

ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఆడుకున్న బిడ్డ ఇక లేదనే నిజాన్ని తండ్రి చేర్పించుకోలేక చాలా ఏడ్చేసాడు.

స్థానిక ప్రజలు పిల్లల గురించి చాలా బాధపడ్డామని చెప్పారు.తమ గుండె బరువెక్కిందని ఎమోషనల్ అయ్యారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇసుక ఎందుకు కూలిపోయిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇది ఎవరైనా కావాలని చేశారా లేదంటే యాక్సిడెంట్లుగా జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

రెస్క్యూను వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.రెస్క్యూ వర్కర్లు పిల్లల్లో ఒకరిని తీసుకువెళుతున్నట్లు వీడియోలో కనిపించింది.ఇది ఊహించలేని ప్రమాదమని ఫైర్ రెస్క్యూ ప్రతినిధి తెలిపారు.ఇది చాలా అరుదైనదని, దురదృష్టకరమని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube