బ్రెజిల్‌లో ఫెర్నాండా వాలోజ్ పింటో( Fernanda Valoz Pinto in Brazil ) అనే ఓ మహిళ పామ్ రీడర్ ఇచ్చిన ఓ చాక్లెట్ తిని మరణించింది.వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.
ఆ జాతకం చెప్పే వ్యక్తి సదరు మహిళ త్వరలోనే చనిపోతుందని చెప్పారు.ఆపై ఓ చాక్లెట్ ఇచ్చారు.
అది తినగానే ఆమె మరణించింది.జాతకాలు చెప్పేవారు ఎక్కువగా ఉండే మాసియోలో ఈ ఏడాది ఆగస్టులో ఈ సంఘటన జరిగింది.
ఆ మహిళ సిటీ సెంటర్ గుండా వెళుతుండగా, ఒక వృద్ధురాలు ఆమెను ఆపి తన అరచేతిని చదువుతానని కోరింది.

తరువాత ఆ ముసలి పామ్ రీడర్ పింటోతో మాట్లాడుతూ పింటో త్వరలో చనిపోతుందని చెబుతూ పింటోకి ఓ చాక్లెట్ బహుమతిగా ఇచ్చిందని పింటో బంధువు బియాంకా క్రిస్టినా తెలిపారు.చాక్లెట్ తిన్న పింటో మృతి చెందిందని వెల్లడించారు.క్రిస్టినా( Christina ) మాట్లాడుతూ, పింటో వాంతులు చేసుకుందని, ఆమె చూపు మసకబారిపోయిందని, ఆమె చాలా బలహీనంగా అనిపించిందని తెలిపారు.
చాక్లెట్ తిన్న గంటల్లోనే ఆమె ఊపిరి వదిలిందని క్రిస్టినా పేర్కొన్నారు.చాక్లెట్ ప్యాక్‌లో ఉన్నందున అది ప్రమాదకరమని పింటో భావించలేదని క్రిస్టినా తెలిపింది.ఆమె కూడా ఆకలితో ఉంది, కాబట్టి తినాలని నిర్ణయించుకుందని వివరించింది.చాక్లెట్ తిన్నాక పింటోకి అస్వస్థత మొదలైందని, ఆమె తన కుటుంబ సభ్యులకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపిందని క్రిస్టినా వెల్లడించింది.

తన గుండె దడదడలాడుతోందని, నోటిలో చేదు రుచి ఉందని చెప్పిందని క్రిస్టినా చెప్పుకొచ్చింది.క్రిస్టినా ప్రకారం, పింటో తన సోదరికి మెసేజ్‌లు పంపుతూనే ఉంది, ఆమె దాదాపు పడిపోయింది, చనిపోతుందని భావించింది.శవపరీక్షలో పింటో శరీరంలో సల్ఫోటెప్, టెర్బుఫోస్ అనే క్రిమిసంహారక మందులు ఎక్కువగా ఉన్నాయని తేలింది.చాక్లెట్‌లో విషం కలిపారా, పింటోను హత్య చేసేందుకు జాతకాన్ని చెప్పే లేడీని నియమించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.