దురదృష్టమో, యాధృచ్చికమో … కొందరి లెగ్ మంచిది కాదు అంటారు.వాళ్ళు ఏది పడితే అది మసి అయిపోతుంది.
ఇదంతా వినడానికి సిల్లిగా అనిపించినా, సినిమావాళ్ళు ఇలాంటి వాటిని బాగా నమ్ముతారు.సినిమా పరిభాషలో ఫ్లాపులు ఇస్తున్న హీరోయిన్లను ఐరన్ లెగ్ అంటారు.
ఇప్పుడు ఆ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కృతి సనన్ కి ఇచ్చేసారు సినిజనాలు.
అమ్మడి కెరీర్ లో 1-నేనొక్కడినే మొదటి సినిమా.
హీరో సూపర్ స్టార్ మహేష్.మహేష్ అంతకుముందు చేసిన దూకుడు,బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అన్ని హిట్ చిత్రాలే.
మహేష్ పేరు చాలు బాక్సాఫీస్ దగ్గర అనుకుంటున్న తరుణంలో భారి డిజాస్టర్ మహేష్ ఖాతాలో పడింది.మహేష్ కోలుకోవడానికి ఏడాది పట్టింది.
హిందీలో వచ్చిన హీరోపంటి కుడా మరీ అంతలా ఆడింది ఏం లేదు.గుడ్డిలో మెల్ల నయం అన్నట్టు ఆ సినిమా కాస్త ఊరట.నాగచైతన్యతో చేసిన దోచేయ్ కుడా పెద్ద డిజాస్టర్.
ఇక కొత్తగా హిందీలో చేసిన దిల్ వాలే కుడా భారి ఫ్లాప్.
మహేష్ బాబు అయినా, షారుఖ్ ఖాన్ అయినా, కృతి హిట్ మాత్రం ఇవ్వలేకపోయారు.దాంతో ఈ బ్యూటిపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారు.
ప్రస్తుతం ఈ అమ్మది చేతిలో ఒకే ఒక్క హిందీ సినిమా మిగిలి ఉంది.అది కుడా పొతే ఇంటికే పరిమితం అవ్వక తప్పదేమో !
.