ప్రస్తుతం మన జీవితాల్లో సెల్ ఒక భాగమై పోయింది.జీవితంలో భాగం అయింది అనడంకంటే శరీరంలో భాగం అయింది అనడం కరెక్టు.
తిండి లేక పోయినా బాధ లేదు.కానీ సెల్ ఫోన్ లేకపోతే నిమిషం గడవదు.
తెలంగాణా రాష్ట్రంలో సెల్ ఫోన్ అమ్మకందారులకు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతోంది.సెల్ ఫోన్ల మీద వ్యాట్ 5 శాతం వ్యాట్ తగ్గించే ఆలోచన చేస్తోందట.
కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి.కాబట్టి ఆ పనే చేయాలని తెలంగాణా సర్కారు యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో 14.5 శాతం వ్యాట్ విధిస్తున్నారు.అయితే పన్ను ఎక్కువగా ఉన్నందువల్ల వ్యాపారులు భారీగా ఎగ్గోడుతున్నారట.సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగినా ప్రభుత్వానికి వ్యాట్ ద్వారా తగినంత ఆదాయం రావడం లేదు.
దీంతో పన్ను తగ్గించాలని అనుకుంటోంది.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని ప్రభుత్వం సెల్ ఫోన్ల మీద పన్ను తగ్గించాలని అనుకోవడం దాని ప్రాధాన్యత ఏమిటో తెలియచేస్తోంది.
మన ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.వ్యాపారుల ముక్కు పిండి పన్ను వసూలు చేయాల్సిన ప్రభుత్వం ఇంకా తగ్గించడం ఏమిటి? రైతులు పంటలకు మద్దతు ధర కోరితే మీన మేషాలు లెక్క పెట్టే ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు అడగ్గానే రాయితాలు ఇస్తాయి.భూములను ధారాదత్తం చేస్తాయి.సెల్ ఫోన్లు విచ్చవిడిగా ఉపయోగించి యువకులు ఇప్పటికే పేద దారి పట్టారు.దేశంలో అత్యధిక నేరాలు సెల్ ఫోన్ల కారణంగానే జరుగుతున్నాయి.అయినప్పటికీ వాటి ధరలు మరింత తగ్గాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.