రివ్యూల వల్ల లాభ నష్టం ఏంత?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు రివ్యూల వల్ల నష్టపోతున్నాం అని, ఇకపై రివ్యూలను ఆపేయాల్సిందిగా కోరుతూ మీడియాకు ఒక ప్రెస్‌ నోట్‌ను విడుదల చేయడం జరిగింది.రివ్యూల వల్ల సినిమాకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు.

 Ban On Movie Telugu Movie Reviews-TeluguStop.com

సినీ ఇండస్ట్రీ పెద్దలు రివ్యూలను ఎలాగైనా ఆపేయించాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ సమయంలో వారు ఆలోచించాల్సిన విషయం ఒక్కటి ఉంది.

రివ్యూలు చదవి సినిమాలకు వెళ్లే వారి సంఖ్య ఎంత ఉంటుంది.మాస్‌ ప్రేక్షకులు అసలు సినిమాల రివ్యూలను పట్టించుకోరు.

అటువంటిది రివ్యూల వల్ల నష్టపోతున్నాం అనడం నిర్మాతల అవివేకం అని కొందరు అంటున్నారు.

సినిమాలు చూసే వారిలో కేవలం 10 నుండి 15 శాతం మంది మాత్రమే రివ్యూలను ఫాలో అవుతారు.

కాకపోతే ఓవర్సీస్‌లో మాత్రం 50 శాతం మంది రివ్యూలను ఫాలో అయ్యి, సినిమాలకు వెళ్తారు.అయితే ఓవర్సీస్‌ మార్కెట్‌ పెద్దగా ఉండదు.

ఇద్దరు ముగ్గురు హీరోలు తప్ప ఇప్పటి వరకు అక్కడ ప్రభావం చూపిన హీరోలు లేరు.అయినా రివ్యూలు మంచిగా వచ్చిన సమయంలో ఆ నిర్మాతలే తమ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయంటూ ప్రచారం చేసుకుంటారు.

విమర్శిస్తే మాత్రం రివ్యూవర్స్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు.మంచి సినిమాను చేస్తే రివ్యూలు ఎలా ఉన్నా, బ్యాడ్‌ పబ్లిసిటీ చేసినా కూడా ఆపలేరు.

అలాంటప్పుడు రివ్యూలను ఆపాలని నిర్మాతలు డిమాండ్‌ చేయడం ఏంటి.రివ్యూల వల్ల నిర్మాతలకు నష్టం ఉంటుందనే వాదన అవివేకం తప్ప మరేం కాదు.

రివ్యూలపై దృష్టి పెట్టకుండా మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేయడం అంటూ కొందరు నిర్మాతలకు సలహాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube