తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తున్నాయి.నిజానికి గేమ్ చేంజర్ ( Game changer )సినిమాతో రామ్ చరణ్ 1500 కోట్ల కలెక్షన్లను రాబడతాడంటు సినిమా యూనిట్ గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది.
మరి ఈ సినిమా కనక ఆశించిన మేరకు విజయాన్ని సాధించినట్లైతే రామ్ చరణ్ ( Ram Charan )మరోసారి గ్లోబల్ స్టార్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నవాడవుతాడు.ఇక సినిమాకి ఇప్పటికే యూ బై ఏ సర్టిఫికెట్ ని అందించారు.ఇక సెన్సార్ బోర్డు వాళ్ళు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక అదే కాకుండా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఈ రెండు సీన్స్ చూస్తే రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు వస్తాయంటూ వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా యూ బై ఏ సర్టిఫికెట్ తో వస్తున్న ఈ సినిమాను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రేక్షకులను ఎలా మెప్పించబోతున్నాడు అనేది తెలియాలంటే ఈనెల 10 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…
.