ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ వేములవాడలో ఏర్పాటు.బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 1000గజాల స్థలం కేటాయింపు…ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలు అందజేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంత రావు…

 Establishment Of Blood Bank Under Indian Red Cross Society, Blood Bank ,indian-TeluguStop.com

త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా భూమి పూజ నిర్వహణ.

ఈ బ్యాంక్ ఏర్పాటుతో వేములవాడ ప్రాంతంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి తప్పనున్న కష్టాలు.బ్లడ్ బ్యాంకు ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న సిరిసిల్ల జిల్లా ప్రజలు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు, రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుంది.రాజన్న భక్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో వేములవాడలో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయిస్తున్నాం.

ప్రస్తుతానికి భవన నిర్మాణం కొరకు ఆసుపత్రి ఆవరణలో 1000 గజాల స్థలాన్ని కేటాయించాం.భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఈ బ్యాంకు ఏర్పాటుతో రక్త పరీక్షలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ తగ్గడం, పెరగడం, తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుంది.స్థానికంగా బ్లడ్ బ్యాంకులు అందుబాటులో లేక ఇన్ని రోజులు కరీంనగర్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లిన ఈ ప్రాంత ప్రజల రక్త కష్టాలు దీంతో తీరనున్నాయి.

జిల్లాకు సంబంధించిన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ను వేములవాడలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సొసైటీ గౌరవాధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ మరియు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం.త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరుతున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube