ఇందిరా మహిళా శక్తి లక్ష్యం చేరుకోవాలి : అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యాన్ని చేరుకోవాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశించారు.ఎల్.

 Indira Mahila Shakti Target Must Be Met: Additional Collector Khemya Naik, Indir-TeluguStop.com

ఆర్.ఎస్ అప్లికేషన్లు, ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరుపై హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డి.పి.ఓ.లు, మెప్మా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్( Dana Kishore ) మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.వ్యక్తిగత, గ్రూప్ ల వారీగా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత, గ్రూప్ లకు కలిపి 17,500 యూనిట్స్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యమని తెలిపారు.వ్యక్తిగత యూనిట్స్ లక్ష్యం 15,000 కాగా, రుణం రూ.52.53 కోట్లు, గ్రూప్ యూనిట్స్ లక్ష్యం 2,500 కాగా, రూ.500 కోట్ల రుణాలు లక్ష్యమని వెల్లడించారు.వ్యక్తిగత యూనిట్స్ ఇప్పటిదాకా 4,248 గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని వివరించారు.

ఆయా యూనిట్స్ ఏర్పాటుపై మహిళా సంఘాల బాధ్యులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతినెలా టార్గెట్ నిర్ణయించి, ముందుకు వెళ్లాలని ఆదేశించారు.జిల్లాలో వ్యక్తిగత  ఇందిరా మహిళా శక్తి యూనిట్ల లక్ష్యం 179, రుణం రూ.6.26 కోట్లు కాగా, ఇప్పటిదాకా 95 యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయని, రూ.1.41 కోట్ల రుణాలు అందించామని అదనపు కలెక్టర్ తెలిపారు.గ్రూప్ యూనిట్ల లక్ష్యం 30 , రుణం రూ.6 కోట్ల కాగా, మూడు యూనిట్స్ రూ.16 లక్షలతో ఏర్పాటు చేశారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వివరించారు.

ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలిఎల్ ఆర్ ఎస్ అప్లికేషన్లో పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశించారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అప్లికేషన్లు పరిష్కరించకపోవడం వారితో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

  ఆయా జిల్లాల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్స్ ఎన్ని? పరిష్కారానికి అర్హత సాధించినవి ఎన్నో ఆరా తీశారు.మున్సిపల్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంపత్ రెడ్డి, ఇన్చార్జి డీపీఓ శేషాద్రి, ఎల్ ఆర్ ఎస్ నోడల్ ఆఫీసర్, డీ.టీ.సీ.పీ.ఓ అన్సార్, డీ.ఎం.సీ రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube