వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్ శ్యామల( Shyamala ) ఏపీలోని కూటమి ప్రభుత్వంపై రోజు రోజుకు తన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇటీవల పుంగనూరులో బాలికపై జరిగిన అత్యాచారం గురించి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన శ్యామల తాజాగా సోషల్ మీడియాలో తన పట్ల వస్తున్నటువంటి ట్రోలింగ్ గురించి ఘాటుగా స్పందించారు.
ప్రస్తుతం వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని తెలిపారు.పిఠాపురంలో ( pithapuram ) ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుర్గాడ జాన్ అనే వ్యక్తిని కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ సెటైర్లు వేశారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించిన తర్వాత తనపై ఎంతో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అంటూ ఈమె మండిపడ్డారు.

తాను ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్న సమయంలో తనకు అవకాశాలు లేకుండా చేశారు.సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి రాకూడదా.ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు నటులే కదా అని ఆమె గుర్తు చేశారు అబ్బాయిలు రాజకీయాలలోకి వస్తే పర్లేదు కానీ అమ్మాయిలు రాజకీయాలలోకి వస్తే ఇలా అసభ్యకరంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
తనను ఎంత కృంగదీయాలని ప్రయత్నించినా వెనకడుగు వేసేది లేదని శ్యామల ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( YS Jagan Mohan Reddy ) మద్దతు తెలియజేస్తూ పాదయాత్రలు తన భర్తతో కలిసి భాగమయ్యారు.
ఇలా వైకాపా పార్టీకి అనుకూలంగా ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న ఈమె ప్రస్తుతం వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి అందుకున్నారు.