కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవ( Devara )ర.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఈనెల 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.
సరిగ్గా పది రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లలో ప్రత్యక్షం కానుంది.అయితే విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
మరోవైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తారక్ పాల్గొంటారు కాబట్టి ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు.తమ దేవర మాట్లాడే మాటలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ ఎక్కడ నిర్వహించాలని మేకర్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఔట్ డోర్లో నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది.తారక్‌కు ఉన్న పాపులారిటీ వల్ల దేవర ఈవెంట్ కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని వారు ముందే హెచ్చరిస్తున్నారట.
ఓపెన్ ప్రదేశాల్లో కార్యక్రమం పెడితే ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువగానే అభిమానులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారట.

అయితే ఎన్టీఆర్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) జోడీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.దేవర నుంచి విడుదలైన అన్నీ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబడుతూ నాలుగు పాటలు ట్రెండ్ అవుతున్నాయి.
టాప్ 25 ట్రెండింగ్ జాబితాలో నాలుగు స్థానాలు దేవర పాటలే ఉన్నాయి.తెలుగులో తొలి స్థానం హిందీలో ఏడవ స్థానం చుట్టమల్లె సాంగ్ తెలుగులో 18వ స్థానం తమిళంలో 25వ స్థానంలో దూసుకుపోతున్నాయి.
ఇలా విడుదలకు ముందే ఎన్టీఆర్ తన పాటలతో అదరగొడుతున్నారు.