రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 131 దరఖాస్తులు వచ్చాయి.కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
రెవెన్యూ – 74,ఎంపీడీఓ చందుర్తి – 1,డీఎంహెచ్వో – 4, ఎంసీ సిరిసిల్ల – 12,డిఎం ఆర్ర్టీసీ – 1,ఎంపీడీఓ కోనరావుపేట – 2, డి డబ్ల్యూ ఓ – 5,ప్రోహిబిషన్ – 1,అగ్రికల్చర్ – 5,ఎంసీ వేములవాడ – 1,ఎంపీడీఓ గంభీరావుపేట – 1,ఎంప్లాయిమెంట్ – 3,ఎడ్యుకేషన్ – 1, డీసీఎస్ ఓ – 5, డి ఆర్ డి ఎ – 2 , ఎంపీడీఓ ముస్తాబాద్ – 2 , డి ఎం డబ్యూ ఓ – 1 డీపీవో – 3,సెస్ – 2 , ఎంపీడీఓ ఎల్లారెడ్డిపేట – 1, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , అగ్రహారం – 1,ఎంపీడీఓ ఇల్లంతకుంట – 1,సర్వే డిపార్ట్మెంట్ – 1,సీపీవో – 1 మొత్తం – 131 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.వో, సూపరింటెండెంట్లు, వివిధ మండలాల రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.