రక్తహీనత ఉన్నవారు నిమ్మరసం తీసుకోకూడదా.. అసలు నిజం ఏంటి?

ఇటీవల కాలంలో రక్తహీనత( Anemia ) అనేది చాలా కామన్ సమస్యగా మారింది.ప్రధానంగా ఆడవారు మరియు చిన్న పిల్లల్లో రక్తహీనత అనేది అధికంగా తలెత్తుతుంది.

 Should Anemic People Not Take Lemon Juice Details, Anemia, Anemic People, Lemon-TeluguStop.com

అయితే రక్తం తక్కువగా ఉన్నవారు నిమ్మరసం( Lemon Juice ) తీసుకోకూడదని కొందరు అంటుంటారు.నిమ్మరసం రక్తాన్ని విరిచేస్తుందని.

ర‌క్త‌హీన‌త సమస్యను మరింత తీవ్రతరంగా మారుస్తుందని భావిస్తుంటారు.కానీ అది కేవలం అపోహ మాత్రమే.

నిజానికి రక్తహీనత ఉన్నవారు నిమ్మరసం తీసుకోవడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత నుంచి త్వరగా బయటపడడానికి నిమ్మరసం తోడ్పడుతుందని అంటున్నారు.

రక్తహీనతను దూరం చేసేంత ఐరన్ కంటెంట్ నిమ్మరసంలో ఉండదు.కానీ విటమిన్ సి మాత్రం పుష్కలంగా ఉంటుంది.

నిమ్మరసంలో లభించే విటమిన్ సి( Vitamin C ) శరీరంలో ఇతర ఆహారాల నుంచి ఇనుము శోషణకు సహాయపడుతుంది.మరియు శరీరం ఇనుమును నిల్వ చేయడంలో చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.

కాబట్టి రక్తహీనత ఉన్నవారు రోజు ఉదయం ఒక గ్లాస్ వాటర్ లో రెండు స్పూన్లు నిమ్మరసం కలిపి తాగితే ఐరన్ కొరత దూరం అవుతుంది.రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.

Telugu Anemia, Anemic, Tips, Immunity, Latest, Lemon, Lemon Benefits, Vitamin-Te

అంతేకాకుండా నిమ్మరసం వల్ల ఆరోగ్య పరంగా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.నిమ్మకాయలో అధిక మొత్తంలో కరిగే ఫైబర్స్ ఉంటాయి.ఇవి సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపర‌చ‌డానికి తోడ్ప‌డ‌తాయి.అలాగే నిమ్మరసంలో పుష్క‌లంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి.

Telugu Anemia, Anemic, Tips, Immunity, Latest, Lemon, Lemon Benefits, Vitamin-Te

నిమ్మర‌సాన్ని రోజూ తీసుకోవడం వ‌ల్ల‌ అధిక రక్తపోటు అదుపులోకి వ‌స్తుంది.మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే అవి క్ర‌మంగా క‌రుగుతాయి.జలుబు మరియు ఫ్లూకి కారణమయ్యే సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా నిమ్మ ర‌సం ప‌ని చేస్తుంది.రోగనిరోధక శక్తిని( Immunity Power ) బలోపేతం చేస్తుంది.ఇక లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్ వెయిస్ లాస్ ప్ర‌క్రియ‌ను నిమ్మ‌ర‌సం వేగ‌వంతం చేస్తుంది.నిత్యం లెమ‌న్ జ్యూస్ ను తీసుకుంటే శ‌రీరంలో అద‌న‌పు కేల‌రీలు బ‌ర్న్ అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube