రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ తిప్పాపూర్ గోశాలలో పరిమితికి మించి ఆవులు, కోడెలు ఉండడంతో, వాటిని ప్రతి అర్హులైన రైతులకు ఉచితంగా రెండు కోడెలను పంపిణీ చేయాలని, బుధవారం ప్రారంభించగా, అట్టి పంపిణీకి విశేష స్పందన వచ్చింది.గురువారం కూడా రైతులు గోశాలకు పోటెత్తగా, ఆలయ గోశాల ఏఈఓలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, సంకె పెల్లి హరికిషన్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది రికార్డ్ లలో నమోదు చేసుకుంటూ ప్రతి అర్హులైన రైతుకు రెండు కోడెల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఇంకా ఎవరైనా అర్హులైన రైతులు ఉంటే దరఖాస్తు ఫారాన్ని పూరించి, దేవాలయ కార్యాలయంలో కలవాల్సిందిగా అధికారులు తెలిపారు.