నీట్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలి ఎన్ టి ఎ ను రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.దేశంలో పాఠశాలలో మూసివేతను ఆపాలి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్,ఎన్ ఎస్ యు ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి , యువజన సంఘాల డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవతకలను నిరసిస్తూ, జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సాయిప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాంతుల మహేష్, మల్లారపు అరుణ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని తెలిపారు.ఎన్టీఏ ను రద్దు చేయాలి,నీట్, యూజీసీ-నెట్, సిఎస్ఆర్ యూజీసీ కంబైన్డ్ నెట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని,కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు.
జాతీయ పరీక్షల సమగ్రతకు కృషి చేయాలనీ , సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడాలనీ ,ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను లాగేసుకొని, విద్యపై పూర్తి నియంత్రణ కోసం యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలని,నీట్ కౌన్సిలింగ్ వెంటనే ఆపివేయాలని, ఇటీవల పిహెచ్ఎ అడ్మిషన్ల భర్తీకై నెట్ స్కోర్ కంపల్సర్ నిబంధనను ఎత్తివేయాలన్నారు.కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలలో సమస్యలు పరిష్కరించాలని,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజురియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలన్నారు.
నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని,దేశంలో పాఠశాలల మూసివేతను విరమించుకోవాలని,(ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం తెచ్చి, అధిక ఫీజులను నియంత్రణ చేయాలని,విద్యారంగ పరిరక్షణకై తీసుకున్న కార్యాచరణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు భాగస్వాములు అయ్యి విజయవంతం అయ్యిందని తెలిపారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.
లేని ఎడల భవిష్యత్తులో మరింత ఉద్యమాలు పోరాటం తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, నేదూరి శ్రీకాంత్, రాకేష్, సాయి తేజ, ప్రవళిక, సంతోష్ తదితరులు పాల్గొన్నారు
.