నేడే గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష

హైదరాబాద్‌: జూన్ 09 రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను ఆదివారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పకడ్బందీగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థు లు హాజరవుతారని వివరించారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతోపాటు ఒక పోలీసు ఉన్నతాధికారి ని కూడా నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని తెలిపారు.

 Today Group 1 Preliminary Exam, Group 1 Preliminary Exam, Hyderabad, Telangana-TeluguStop.com

ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కోఆర్డినేటర్‌ను కూడా నియమించామని పేర్కొన్నారు.గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని వివరించారు.అదేరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి స్తామని తెలిపారు.ఉదయం 10 గంటలకు అంటే పరీక్షా ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివే స్తామని పేర్కొన్నారు.

ఆ తర్వాత వచ్చిన అభ్యర్థు లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.పరీక్షకు హాజరయ్యేటపుడు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు ఒరిజి నల్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌, మూడు నుంచి ఐదు కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ను నియమించామని వివరించారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు.

ఆదివారం ప్రత్యేక బస్సుల ను నడపాలని టీజీఎస్‌ ఆర్టీసీని కోరామని పేర్కొ న్నారు.పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, మ్యాథమెటికల్‌ టేబుల్స్‌, బ్యాగ్‌లు, ప్యాడ్‌ లు, ఇతర ఎలక్ట్రానిక్‌లను అభ్యర్థులు తేవడాన్ని నిషేధించామని వివరించారు.హాల్‌టికెట్‌లో పొందుపర్చిన నిబంధనలను తప్పనిసరిగా అభ్యర్థులు పాటించాలని కోరారు.563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube