నేడు టీపీసీసీ విస్తృత సమావేశం

హైదరాబాద్ : మే 22 నేడు టిపిసిసి విస్తృత సమావేశం సోమవారం జరుగనుంది.గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

 Tpcc Meeting At Gandhi Bhawan,tpcc Meeting ,gandhi Bhawan, Manikrao Thakray, Tpc-TeluguStop.com

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యవర్గం, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణతోపాటు తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

యుగంధర్‌కు ఫోన్లో రేవంత్‌ పరామర్శ

ఉప్పల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యుగంధర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం ఫోన్‌ చేసి పరామర్శించారు.ఈ సందర్భంగా తనపై దాడి జరిగిన పూర్వా పరాలను రేవంత్‌కు యుగంధర్‌ వివరించారు.

భయపడాల్సిన పని లేదని, కాంగ్రెస్‌ అండగా ఉంటుందని ఆయనకు రేవంత్‌ భరోసానిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube