హైదరాబాద్ లోని కొంపల్లిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ తీవ్ర కలకలం సృష్టించింది.కొంపల్లి – సుచిత్ర ప్రధాన రహదారిపై గ్యాస్ పైప్ లైన్ లీక్ అవుతుంది.
గ్యాస్ భారీ స్థాయిలో లీక్ అవుతుండటంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు దూరంగా పరుగులు తీశారు.
అయితే రోడ్డు పక్కన తవ్వకాలు జరిగిన నేపథ్యంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిందా? లేక ఇంకేమైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.







