తెలంగాణలో పంట కాలపరిమితి కుదింపు.. కేసీఆర్ కీలక ఆదేశాలు

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయనుంది.

 Shortening Of Harvest Period In Telangana.. Kcr's Key Orders-TeluguStop.com

కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇందులో భాగంగా వానాకాలం పంట సన్నద్ధతతో పాటు వానాకాలం, యాసంగి పంట కాలం కుదించనున్నారని తెలుస్తోంది.

పంట కాల పరిమితి కుదింపుపై దశాబ్ది ఉత్సవాల్లో రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ముందస్తు వరి సాగుపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ముందస్తు వరి సాగుపై ప్రతి మంగళవారం, శుక్రవారం రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.ప్రతి నెల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమీక్షలు నిర్వహించాలన్నారు.

నవంబర్ 15 నుంచి 20 లోగా నాట్లు వేసుకోవాలన్న కేసీఆర్ పంటను మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ వారానికల్లా కోసుకోవచ్చని చెప్పారు.ఈ విధంగా చేస్తే వర్షాల నుంచి రైతులు బయట పడొచ్చని తెలిపారు.

వానాకాలంలో కంది పంటతో పాటు పత్తి సాగు చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube