జనవరి 6, 7న గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్ పిఎస్సీ కసరత్తు

తెలంగాణ రాష్ట్రము( Telangana State ) లో నిర్వహించవలసిన గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ ( TSPSC )కసరత్తు ప్రారంభించింది.వచ్చేనెల జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించబోయే ఈ పరీక్ష నిర్వహణపై నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కమిషన్‌ సమావేశమైంది.పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై చర్చించింది.గ్రూప్‌-2 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 29, 30న నిర్వహించాల్సి ఉన్నది.అభ్యర్థుల కోరిక మేర కు పరీక్షను కమిషన్‌ వాయిదా వేసి, నవంబర్‌ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది.అయితే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో మరోసారి వాయిదా పడింది.

 Ts Psc Exercise For Conducting Group-2 Exams On 6th And 7th January-TeluguStop.com

జనవరి 6, 7 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది.ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, వసతులు, నిబంధనలు తదితర అంశాలపై 33 జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌( Anita Ramachandran )పలు సూచనలు చేశారు.

ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని, అందులో మార్పులు, చేర్పులుంటే తమకు తెలియజేయాలని సూచించారు.చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని, అక్కడే కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ తెప్పించి పంపిణీ చేయాలని, ఓఎంఆర్‌ షీట్లు లెక్కించడం, ప్యాక్‌ చేయడం, సీల్‌ వేయడం వంటివన్నీ జరగాలని వివరించారు.

పరీక్ష కేంద్రాలను ఈ నెల 7లోగా ఫైనల్‌ చేసి, టీఎస్‌పీఎస్సీకి నివేదించాలని ఆదేశించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube