అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్:ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) గన్‌పార్క్‌కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు .

 Tpcc Chief Revanth Reddy Arrested, , Arrested ,revanth Reddy , Election Code,-TeluguStop.com

రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు( CM KCR ) రేవంత్ రెడ్డి సవాలు చేశారు.అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు.

డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు.

గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు.దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఎన్నికల కోడ్ ( Election Code )అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు.గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి తీరుతామని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు.

చివరకు పోలీసుల వాహనంలో రేవంత్‌ రెడ్డిని తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube