వీరసింహారెడ్డి కంటే భగవంత్ కేసరి మూవీ తక్కువ బిజినెస్ చేయడానికి కారణాలివేనా?

మరికొన్ని గంటల్లో భగవంత్ కేసరి మూవీ( Bhagavanth Kesari ) థియేటర్లలో విడుదల కానుంది.భగవంత్ కేసరిపై కొన్ని ఏరియాలలో లియో డామినేషన్ ఉన్నా లియో( Leo )కు కొన్ని సమస్యలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

 Reasons Behind Veerasimhareddy Movie Less Business Details Here Goes Viral ,bha-TeluguStop.com

అయితే భగవంత్ కేసరి సినిమాకు అఖండ కంటే ఎక్కువ బిజినెస్ జరగగా వీరసింహారెడ్డి కంటే తక్కువ బిజినెస్ జరిగింది.వీరసింహారెడ్డి కంటే భగవంత్ కేసరి మూవీ తక్కువ బిజినెస్ చేయడానికి కారణాలు ఏంటనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.

వీరసింహారెడ్డి మూవీ( Veera Simha Reddy )కి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కాగా ఆ నిర్మాతలకు ఉన్న క్రెడిబిలిటీ వల్ల వీరసింహారెడ్డి హక్కులు భారీ రేటుకు పలికాయి.అఖండ తర్వాత మూవీ కావడం, ట్రైలర్ ఊరమాస్ గా ఉండటం, సంక్రాంతి సీజన్ కు రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.అయితే భగవంత్ కేసరి సినిమా బాలయ్య మార్క్ కు భిన్నంగా ఉండటంతో ఈ సినిమాకు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు.

ఈ సినిమాకు 68 కోట్ల రూపాయల రేంజ్( Bhagavanth Kesari Business ) లో బిజినెస్ జరగగా వీరసింహారెడ్డి సినిమాకు 73 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.

భగవంత్ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉంటాయి.భగవంత్ కేసరి కథకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా భారీ లెవెల్ లో తెరకెక్కిందని తెలుస్తోంది.ఈ సినిమాలో 5 యాక్షన్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది.థమన్ ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ ను మెప్పిస్తుందని చెబుతున్నారు.బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించడం లేదు.ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube