ఢిల్లీలో బి ఆర్ ఎస్ ఆఫీస్ నేడు ప్రారంభించునున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది.జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది.

 Cm Kcr To Open Brs Office In Delhi Today-TeluguStop.com

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు.అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు.ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు.అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఒడపల్లి మాధవ్‌ తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

పార్టీ ప్రారంభోత్స నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌రోడ్డు, తెలంగాణభవన్‌ పరిసరాల్లో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి.

నూతన కార్యాలయంలో పార్టీ అధినేత చాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు ప్రత్యేక గదులన్నింటినీ పూలతో అలంకరించారు.కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube