హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడింది.ఈ మేరకు సుమారు ఐదు కిలోల డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సింగపూర్ మరియు ఢిల్లీ నుంచి ఓ ముఠా డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలో హ్యాండ్ బ్యాగ్ లో బ్రౌన్ టేపు వేసి డ్రగ్స్ ను తరలిస్తుండగా గుర్తించిన డీఆర్ఐ అధికారులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.కాగా పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.