టిడిపికి ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధి వైసిపికి లేదు - భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

నంద్యాల జిల్లా: భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రెస్ మీట్.మీడియా సమావశంలో టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనార్థం నిన్న జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కొంతమంది వైసిపి నాయకులు రాయలసీమకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అని మాట్లాడం సిగ్గుచేటని భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి మండిపడ్డాడు.2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అనగా 2019 వరకు రాయలసీమ ప్రాజెక్టుల కోసం దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు.అయితే వైసిపి ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో చెప్పాలని అన్నారు.

 Bhuma Jagat Vikhyat Reddy Criticizes Ycp Over Rayalaseema Projects, Bhuma Jagat-TeluguStop.com

బైరెడ్డికి సిద్దార్థ్ రెడ్డి సీమ ప్రాజెక్టులపై మాట్లడిన మాటలకు భూమా విఖ్యాత్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.టిడిపికి ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధి వైసిపికి లేదు టిడిపి హయాంలో తొంబై శాతం పూర్తి అయిన ప్రాజెక్టును వైసిపి ఎందుకు పూర్తి చెయ్యలేదు.ప్రాజెక్టులను వైసిపి నాలుగేళ్ళలో ఖర్చు పెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే అని అన్నారు.దీన్ని బట్టి ఎవరి పిల్లల్లి ఎవరు పెంచినారో అర్థం చేసుకోవాలన్నారు.రాయలసీమ ప్రాజెక్టుల గురించి చిత్తశుద్ధితో పని చేసింది టిడిపి మాత్రమే అన్నారు.సీమలో ప్రతి ఎకరంకు సాగు నీరు అందిచే దిశగా చంద్రబాబు ఆలోచిస్తూన్నారు.రాజకీయంగా శిల్పా కుటుంబాన్ని ఎదుర్కొనే ధైర్యం భూమా కుటుంబానికి తప్ప ఎవరికీ లేదని అన్నారు.

నంద్యాలకు నేను పదవికోసం రాలేదు.వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చిన,ఇవ్వకున్న పార్టీ కోసం బాధ్యతతో పనిచేస్తానని అధిష్టానానికి కూడా చెప్పానని అన్నారు.

అందుకే పార్టీ కూడా మమ్మల్ని ఎప్పుడు నంద్యాలలో మీరు ఏమిచేస్తున్నారని అనలేదు.

నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆ సంస్కృతి మాకు లేదని అన్నారు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మీటింగ్ లో అఖిల ప్రియ ఆళ్లగడ్డలో పనిచేస్తుంది అని చెప్పారు.

నంద్యాలలో అందర్నీ కలుపుకొని పోయేలా ముందుకు వెళ్ళండి అని చెప్పారు.నంద్యాలలో ఉన్న నాయకులు ఈ విషయాన్ని చాలా విధాలుగా వాడుకొని పార్టీ మమ్మల్ని దూరం పెట్టిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అధిష్టానం మమ్మల్ని నంద్యాలకు రావద్దని చెప్పారని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు.నంద్యాలలో భూమా నాగిరెడ్డికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు,కార్యకర్తల అందరి బాధ్యత నాపై ఉంది.

వచ్చే ఎన్నికలలో అధిష్టానం శిల్పా కుటుంబాన్ని ఎదుర్కొనే వ్యక్తిని నంద్యాలలో నిలబెట్టి సపోర్ట్ చేయమంటే అందుకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube