తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారు.
ఎన్ని నెరవేర్చారో చెప్పాలని తెలిపారు.
రాష్ట్రంపై ఉన్న రూ.5 లక్షల కోట్ల అప్పును కేసీఆర్ ఎలా తీర్చుతారో చెప్పాలన్నారు బండి సంజయ్.బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నది నిజమైతే కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు మద్ధతు ఇవ్వడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.కాంగ్రెస్ ఎందుకు డిపాజిట్లు కూడా కోల్పోతుందో చెప్పాలని తెలిపారు.