ఏపీలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థుల( YSRCP MP Candidates ) జాబితా విడుదలైంది.ఈ మేరకు పార్టీ నేత నందిగం సురేశ్ 24 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీ,( Botsa Jhansi ) విజయనగరం – చంద్రశేఖర్, నరసరావుపేట – అనిల్ యాదవ్, శ్రీకాకుళం – పేరాడ తిలక్, గుంటూరు – కిలారి రోశయ్య, ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,( Chevireddy Bhaskar Reddy ) అమలాపురం – రాపాక వరప్రసాద్,( Rapaka Varaprasad ) నెల్లూరు – విజయసాయిరెడ్డి, కర్నూలు – డీవై రామయ్య, కాకినాడ – చలమలశెట్టి సునీల్, చిత్తూరు – రెడ్డప్ప, కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి, రాజమండ్రి – డాక్టర్ గూడూరి శ్రీనివాసులు,
నరసాపురం – గూడూరి ఉమాబాల, ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు, విజయవాడ – కేశినేని నాని, అరకు – చెట్టి తనూజ రాణి, బాపట్ల – నందిగం సురేశ్ బాబు, తిరుపతి – మద్దిల గురుమూర్తి, రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, నంద్యాల – పోచ బ్రహ్మానందా రెడ్డి, హిందూపురం – జోలదరాశి శాంత, అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారని వెల్లడించారు.కాగా అనకాపల్లి ఎంపీ స్థానం పెండింగ్ లో ఉంచినట్లు తెలిపారు.