మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ లో ఎమ్మెల్యే భేటి సుభాష్ రెడ్డి తన కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు.
పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వహించానన్నారు.తానెప్పుడూ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తాను ప్రజల్లోనే ఉంటానన్న ఆయన అందుకోసం దేనికైనా సిద్ధమని వెల్లడించారు.అయితే తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ జాబితాలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి భేతి సుభాష్ రెడ్డిని కాదని అభ్యర్థిగా మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ప్రకటించింది.







